Aug 20,2023 00:19

మంగళగిరి: చింతక్రింది కనకయ్య 73వ వర్థంతి సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హైస్కూల్‌ ఆవరణ లోని కనకయ్య విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులు అర్పిం చారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలాజి మాట్లాడుతూ మంగళగిరిలో స్వాతంత్య్రం రాక ముందు సి.కె హైస్కూలుని ఏర్పాటు చేసి వేలాది మంది చదువుకునేందుకు దోహదం చేశారని అన్నారు. అందువలన మంగళగిరి,పరిసర ప్రాంతాలలోని వేలాది మంది చదువు కుని అభివృద్ధికి తోడ్పడిందని కొనిj ూడారు. కనకయ్య హైస్కూలు ఎయిడెడ్‌ కావడం వలన ప్రభుత్వం అను సరిస్తున్న ఎయిడెడ్‌ వ్వతిరేక విధానాల వలన నేటి ప్రజాప్రతినిధులు కల్పిస్తున్న అవరోధాల వలన అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, సి కె విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోందని అన్నారు. అందుకు కారణం విద్య వ్యాపారంగా మారి విద్యా సంస్థల మధ్య పోటీ ఏర్పడడం, తరగతిగదుల్లో కొరవడిన శుభ్రత,బెంచ్‌లు,బ్లాక్‌ బోర్డులు, లైట్లు,ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడమేనని అన్నారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా సబ్జెక్టు టీచర్లు లేక పోవడం వలన విద్యార్ధులు చేరడంలేదని అన్నారు. ఉన్నత ఆశయాలతో నెలకొల్పిన ఈ విద్యా సంస్థను కాపాడు కోవాల్సిన అవసరం వుందని అన్నారు. సికె హైస్కూలును పట్టించుకునే నాథుడే లేడని, ఈ విద్యాసంస్థల ద్వారా ఎదిగిన నాయకులు, పై స్థాయిలో అధికారులు ఎంతోమంది వున్నా సమస్యలు తీర్చలేక పోవ డం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు రవితేజ,మున్నా నాయకులు రోఫా పాల్గొన్నారు.