ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న సత్యనారాయణ తదితరులు
ప్రజాశక్తి- గాజువాక : అగనంపూడి సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను వినియోగంలోకి తేవాలని అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్లాంట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగనంపూడిలో జీవీఎంసీ అధికారులు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఐదేళ్ల క్రితం నిర్మించినా ఇంతవరకు వినియోగంలోకి తేలేదన్నారు. అగనంపూడి నుంచి దువ్వాడకు వెళ్లే రోడ్డుపై వీధిలైట్లు వేయలేదని తెలిపారు. అగనంపూడి కాలనీలో కాలువలు ఏర్పాటుచేయాలని కోరేరు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గోవిందరావు, నిర్వాసిత నాయకులు నర్సింగరావు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.










