శీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు
శీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు
ప్రజాశక్తి - తిరుమల
శుక్రవారం సాయంత్రం తిరుమలకు విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలకగా టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. ఇకపై సంవత్సరానికి ఒక్కసారే కుటుంబంలో తిరుమలకు రానున్నట్లు వెల్లడించారు.










