సీతానగరం : మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటీవల ఎండలకు వరినారు మండలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు వర్షం పడ్డంతో పొలాల్లో నీరు నిల్వ ఉంది.
సాలూరు రూరల్ : గత పది రోజులు నుండి ఒక్కరోజు కూడా వర్షం లేక ఎండ వేడితో జనం అల్లడిపోతున్న తరుణంలో బుధవారం కురుసిన వర్షానికి సేదతీరారు. కొద్ది రోజుల క్రితం పడిన వర్షానికి రైతులు మొక్క జొన్న, పత్తి, వరి నారు నాటుకున్నారు. నాటిని నాటి నుండి వర్షాలు లేక నాటిన విత్తనాలు మొలకెత్త లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది రైతులు మోటార్లు, ఇంజిన్‌లతోని వరినారు మడులను తడుపుకుంటున్నారు. ఈ వర్షంతో చాలా వరకు రైతులకు ఉపయోగకరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు










