Sep 29,2023 22:19

ప్రజాశక్తి - కాళ్ల
              మండలంలోని సీసలిలో ఉన్న విద్యాగణపతి ఆలయంలో దాతల సహకారంతో శుక్రవారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. లడ్డు వేలం పాట నిర్వహించారు. వేలంలో లడ్డు ను దక్కించుకున్న మద్దాల మోహన్‌కృష్ణను ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అభినందించారు. ఈ అన్నసమారాధనకు వేలాది మంది భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సీసలి మాజీ సర్పంచి కట్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచి తోట ఫణిబాబు, నూకల భోగేంద్రబాబు, కొమ్మన నాగబాబు, తోట హరిబాబు పాల్గొన్నారు.