Sep 15,2023 23:44

సీసీ రోడ్ల నిర్మాణకి శంకుస్థాపన


సీసీ రోడ్ల నిర్మాణకి శంకుస్థాపన
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ :గూడూరు రెండవ పట్టణ పరిధిలోని మాలవ్యనగర్‌ ప్రాంతంలోని 19 సచివాలయం పరిధిలో శుక్రవారం 40 లక్షల నిధుల తో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ముందు స్థానిక వైసిపి నాయకులు, సచివాలయ కన్వీనర్‌ వినీష్‌ యాదవ్‌ , ఎస్సీ సెల్‌ నాయకులు నరసయ్య ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులు నాయకులతో కలిసి సీసీ రోడ్లు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని సత్వర పరిష్కార ధ్యేయంగా కషి చేస్తున్నామని తాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని అభివద్ధి ధ్యేయంగా కషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వినీష్‌ యాదవ్‌ , నరసయ్య పాల్గొన్నారు.