
నూజివీడు రూరల్ : గొల్లపల్లి గ్రామంలో దాతల సహకారంతో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు ప్రారంభ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సీసీ రోడ్లను గ్రామస్తులు, సర్పంచి, ఎంపిటిసి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సమక్షంలో దాతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భానుమతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గోగినేని విజయ గోపాల్ పాల్గొన్నారు.