Oct 01,2023 22:34

ప్రజాశక్తి - వీరవాసరం
           విభేదాలు పక్కనపెట్టి భేదాలు చూపకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయడమే అర్థవంతమైన రాజకీయాలకు నిదర్శనమని ఎంపిపి వీరవల్లి దుర్గాభవాణి అన్నారు. దూసనపూడిలో చేపట్టబోయే రెండు సీసీ రహదారుల పనులను ఎంపిపి ఆదివారం ప్రారంభించారు. ఈ రెండు రహదారులను మండల పరిషత్‌ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.90 లక్షలతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మండలంలో కొన్ని పంచాయితీలకు మండల పరిషత్‌ నిధులు కేటాయించినా పనులు చేపట్టేందుకు సర్పంచులు ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యర్రంశెట్టి నాగసాయి, మాజీ సర్పంచి దాడి కాశీ, వైస్‌ ఎంపిపి చిలకపాటి ప్రకాశం, గుండా రామకృష్ణ పాల్గొన్నారు.