సీసీ కెమెరాలు ఏర్పాటు
సీసీ కెమెరాలు ఏర్పాటు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టులో ఎనిమిది సీసీ కెమెరా లను శ్రీకాళహస్తి డిఎస్పి భీమారావు సోమవారం ప్రారంభించారు. ప్రజా భద్రత దష్ట్యా దాతల సహకారంతో టూటౌన్ పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారని డిఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా దాతలను అభినందించి, సత్కరించారు. టూటౌన్ సీఐ మల్లికార్జున, ఎస్‌ఐ మహేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.










