
ప్రజాశక్తి - పాలకోడేరు
పాలకోడేరు మండల బిసి నాయకుడు, టిడిపికి చెందిన కామన రాంబాబు ఆంధ్రప్రదేశ్ సీఫుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ కోశాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గొల్లలకోడేరు గ్రామానికి చెందిన కామన రాంబాబును టిడిపి మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, టిడిపి గొల్లలకోడేరు అధ్యక్షులు, కమ్మిలి వెంకట శివరామకృష్ణంరాజు (రాంబాబు) కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు.