
ప్రజాశక్తి - పాలకొల్లు
సీనియర్ పాత్రికేయులు కలిదిండి మల్లపురాజు (91) శనివారం తెల్లవారుజామున పాలకొల్లులోని తన స్వగృహంలో మృతి చెందారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రారంభ కాలం నుండి పాలకొల్లు విలేకరిగా సుదీర్ఘకాలం పనిచేశారు. పాలకొల్లు ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా చేశారు. ఎపియుడబ్ల్యుజే జిల్లా శాఖకు 1978- 1984 వరకు అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి ఐజెయు జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, రాష్ట్ర అధ్యక్షుడు ఐవి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్, జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు వి.సాయిబాబా, వై.గిరిజాపతి, బి.బుచ్చిబాబు, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు ముత్యాల శ్రీనివాస్, పాలకొల్లు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విన్నకోట వెంకటరమణ, కార్యదర్శి ఎంఎన్‌వి.సాంబశివరావు, కోశాధికారి తోట రాంబాబు, సీనియర్ పాత్రికేయులు నరసింహరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పిటి వెంకటేశ్వరరావు సంతాపం తెలిపారు.