Sep 06,2023 22:18

    కలిదిండి : కైకలూరు నియోజకవర్గ స్థాయిలో గత 35 ఏళ్ల నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న పొంగులేటి ఇజ్రాయేల్‌ను కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఎంపిటిసి నీలిసుమన్‌ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో సన్మానించారు. ప్రజాసమస్యల పరిష్కారమే థ్యేయంగా, ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా పాత్రికేయులు నిరంతరం శ్రమిస్తుంటారని నీలి సుమన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట కలిదిండి ఎంపిటిసి చాన్‌ భాషా, నాయకులు కుంబా నాగరాజు, మావులూరి బాబూరావు, కాశీరాజు పాల్గొన్నారు.