Jul 23,2021 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి, పనులు జరగుతున్న తీరుపై ఆగస్టు తొమ్మిదవ తేదిలోగా నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. జస్టిస్‌ రామకఅష్ణన్‌ నేతఅత్వంలోని ఎన్‌జిటి చెన్నై శుక్రవారంనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎన్‌జిటి తప్పు పట్టింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపి సహకరించట్లేదని కఅష్ణా నదీయజమాన్యబోర్డు అఫిడవిట్‌ దాఖలు చేయగా, ఎన్‌జిటి ఆదేశాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్‌ పనులు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టు పరిశీలనకు కృష్ణా బోర్డు బృందం రావల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాదించింది. పనులు చేపట్టవద్దన్న ఎన్‌జిటి ఆదేశాలను తమ ప్రభుత్వం దిక్కరించలేదని, ప్రాజెక్టు డిపిఆర్‌కు సంబంధించిన అధ్యయన పనులు మాత్రమే జగరుతున్నాయని పేర్కొంది. ఈ దశలో తెలంగాణ తరపున వాదనలు వినిపించిన ఆ రాష్ట్ర ఎఎజి కృష్ణాబోర్డుకు ఎపి ప్రభుత్వం సహకరించడంలేదని, అందువల్ల ఎన్‌జిటి బృందమే స్వయంగా పరిశీలించాలని కోరారు. పర్యటనకు అవసరమైన హెలికాప్టర్‌ తో పాటు ఇతర సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన ఎన్‌జిటి ఎపి ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతగానే కృష్ణాబోర్డు పర్యటనకు వెళ్లాలని ఆదేశించింది. పూర్తిస్థాయి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించిన ఎన్‌జిటి ధర్మాసనం విచారణ ప్రక్రియను ఆగస్టు 9వ తేదికి వాయిదా వేసింది.