ప్రజాశక్తి -సీలేరు: సీలేరులో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని సోమవారం సిఆర్‌పిఎఫ్ 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి సీలేరు ఎపి జెన్‌కో కాలనీ ప్రధాన రహదారి గుండా పోస్టాఫీస్, రామాలయం మీదుగా విద్యార్థులు మువ్వన్నెల జాతీయ జెండాలను పట్టుకుని, రెపరెపలాడిస్తూ, భారత్ మాతాకీ జై, స్వతంత్ర భారత్‌కీ జై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్‌కు చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు.
ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ, ఎంపిటిసి పిల్లా. సాంబమూర్తి, డిఎవి ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, 76 ఏళ్లుపూర్తి చేసుకుని, 77వ ఏటలోకి అడుగిడుతున్న సందర్భంలోఇంటింటా జాతీయ జెండాను ఎగరేసి, భారతదేశ ఖ్యాతిని తెలియజేయాలన్నారు స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన నేతల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. దేశభద్రతకు సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్ల త్యాగాలను, స్ఫూర్తిని తెలియజెప్పాలన్నారు. జాతీయజెండాకు వందనం చేసి, దాని గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డిఎవి జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సాయిరాం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల మాక్‌డ్రిల్
విఅర్.పురం: 77 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో విద్యార్థులు సోమవారం ముందస్తుగా రిహార్సల్స్ నిర్వహించారు. హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మాక్‌డ్రిల్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థులంతా క్రమశిక్షణతో సిద్ధం కావాలని హెచ్‌ఎం బాబూరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.....










