Oct 01,2022 22:54

సీలేరులో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి - సీలేరు
జీకే వీధి మండలం సీలేరులో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తర్వాత మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని మేఘావృతమై కుండపోత వర్షం కురిసింది. సీలేరుతో పాటు ధారకొండ దుప్పిలివాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో గిరిజన రైతులలో ఆనందం వెల్లి విరిసింది. ఈ వర్షాలు పోడు వ్యవసాయానికి ఎంతో దోహదపడతాయని గిరిజన రైతులు సంతోషాన్ని వెల్లబుచ్చారు.