Oct 06,2022 23:52

సీలేరు డ్యామ్‌ వద్ద బెంగళూరుకు చెందిన వైద్యాధికారుల బృందం

ప్రజాశక్తి- సీలేరు
జికె.వీధి మండలం సీలేరు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు బుధ, గురువారాలు పెద్ద సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. సీలేరు ఒడిలో నేలవైన ప్రకృతి రమణీయమైన సుందర దృశ్యాలను పర్యాటకులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆ దృశ్యాల్లో తమ సెల్‌ఫోన్లలో బంధించారు. బెంగళూరు నుంచి దసరా సెలవులు సందర్భంగా సీలేరు వచ్చిన వైద్య అధికారుల బృందం సీలేరు పరిసర ప్రాంతాల్లోని సుందర దృశ్యాలను తిలకించారు. గురువారం ఉదయం స్థానిక మెయిన్‌ డ్యాం రిజర్వాయర్‌ వద్ద మంచు మేఘాలు, పచ్చని కోండ్లు చెట్లు ఆకులు పైనుంచి జాలు వారే మంచు బిందువులు వంటి దృశ్యాలు తిలకించి పులకరించిపోయారు. బెంగళూరులో రామకృష్ణ ఆయుర్వేద మెడికల్‌ కాలేజీకి చెందిన వైద్య బృందంలోని ఆదిత్య అనే యువకుడు ప్రజాశక్తితో తన అనుభూతిని పంచుకున్నారు. ఇక్కడి ప్రకతి అందాలు తమకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చాయని చెప్పారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆయుర్వేదమందులకు దోహదపడే వనమూలికలు పరిశోధన చేస్తే దొరుకుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.