Oct 17,2023 20:41

విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా

కడప అర్బన్‌ : శ్రీకృష్ణదేవరాయలు పాలన స్ఫూర్తిదాకం, ఆదర్శనీయమని, పాలకులు ఆయన అడుగుజాడల్లో నడవాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాష, మేయర్‌ కే సురేష్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కష్ణ సర్కిల్‌ వద్దనున్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వద్ద 494 వర్ధంతిని వైసిపి ఈ జోన్‌ అధ్యక్షులు తోట కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్‌ దక్షిణ భారతదేశంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలనలో దక్షిణ భారతదేశంలో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ దక్షిణ భారతదేశంలో ఆయన కట్టించిన కుంటలు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. చెరువులు కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం రైతులకు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయి అంటే ఆరోజు శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించిన తవ్వించిన చెరువులు ఆధారంగానే అని చెప్పవచ్చునన్నారు. మొదట 494 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు అప్జల్‌ ఖాన్‌, కార్పోరేటర్‌ షేక్‌. మొహమ్మద్‌ షఫీ, నాయకులు నారపరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణ, మురళి, పోరం కొండయ్య, రామకష్ణ, శివ కేశవ, నాయకురాలు పత్తి రాజేశ్వరి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : రాళ్లసీమలో వ్యవసాయాన్ని, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు అని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రచయితల సంఘం జిల్లా కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక అగస్తేశ్వరాలయ సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర భోషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్‌, వారధి మధు, గండికోట బాబ, ఎర్రగుంట్ల శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ భాగవతార్‌ యడవల్లి రమణయ్య పాల్గొన్నారు. వేంపల్లె : స్థానిక బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ గౌరిదేవి ఆలయంలో బలిజ సంఘం అధ్యక్షులు కుళాయప్ప, కటిక చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు కొత్తూరు రెడ్డయ్య, ఉపాధ్యక్షులు ఎడాల రాము, ఎద్దుల రామచంద్ర, ప్రధాన కార్యదర్శి నామా శేఖర్‌, మహిళా మండలి అధ్యక్షురాలు రత్నాలమ్మ, శైలజ, సరోజమ్మ, జ్యోతి పాల్గొన్నారు.