సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు : కమిషనర్
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే 'స్పందన' కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణతో కలిసి పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో పరిశుభ్రత పాటించాలని, వర్షపునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని, దోమలు వృద్ధి చెందే ప్రదేశాల్లో, కాల్వల్లో దోమల మందులు చల్లించాలని, సాయంత్రం దోమల నివారణకు పొగ వేయాలని ఆదేశించారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్‌కు 20, స్పందనకు 23 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీవ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్ పాల్గొన్నారు.










