Sep 08,2023 22:05

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ శివప్రసాద్‌

సీజనల్‌ వ్యాధులు - జంక్‌ఫుడ్‌పై అవగాహన
ప్రజాశక్తి-కావలి : స్థానిక గాయత్రి నగర్‌లోని నలంద ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జెవివి జిల్లా నాయకులు పాపిశెట్టి.జానకిరామ్‌ అధ్యక్షతన సీజనల్‌ వ్యాధులు - జంక్‌ఫుడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి పట్టణ ప్రముఖ డాక్టర్‌ పి.శివప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులు తినుబండారాలుగా పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్‌, తదితర జంక్‌ (ప్రిజర్వ్డు ఫుడ్స్‌) పదార్థాలు తీసుకుంటున్నారని తెలిపారు. వీటిని ఎక్కువ కాలం నిల్వచేసేందుకు వాడే కెమికల్‌ విద్యార్థులకు హాని కలుగజేస్తున్నాయని, వీటికి బదులుగా ఇంటి వద్ద అమ్మ వండే కమ్మని ఆహారపదార్థాలు తీసుకొని ఆరోగ్యం పరిరక్షించు కోవాలని సూచించారు.
సీజనల్‌ వ్యాధులు-ఆరోగ్య పరిరక్షణ, ఇటీవల షార్‌ సైంటిస్టులు చంద్రునిపై పరిశోధనకు పంపిన చంద్రయాన్‌-3 మొదలైన అంశాలపై విద్యార్థులు మాట్లాడినందుకు జన విజ్ఞాన వేదిక సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో నలంద హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఉమారెడ్డి, కావలి పట్టణ జెవివి కోశాధికారి టి.సుబ్బరామ శర్మ, ఉపాధ్యక్షులు కందికట్టు నారాయణ, సి.కల్లయ్య, కార్యదర్శి గుణకల.శివయ్య, కార్యవర్గసభ్యులు ఎం.వి.ఎన్‌.ప్రసాద్‌ (రిటైర్డ్‌ లెక్చరర్‌), ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.