Nov 07,2023 20:58

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ కరిష్మా

సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మండలంలో సీజనల్‌ వ్యాధులు సోకకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారిని డాక్టర్‌ కరిష్మా అన్నారు. మంగళవారం ఆశ డే సందర్భంగా స్థానిక వైద్యశాలలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రెఫరల్‌ కేసుల వారిని జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు.
వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ప్రతి గ్రామంలోని పాఠశాలలో మంచినీటి వనరులలో ఫ్లోరోసిస్‌ ఉందో లేదో గుర్తించాలన్నారు. ఫ్లోరోసిస్‌ లక్షణాలు ఉంటే వాటర్‌ శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. సమావేశంలో సిహెచ్‌ఒ రాజశేఖర్‌, సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.