సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
ప్రజాశక్తి -కెవిబిపురం: 39 పంచాయతీలు ఉన్న కేవిబిపురం మండ ల ప్రజలకు వర్షా కాలంలో వచ్చే వ్యాధు లపై ఏఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని డాక్టర్ కటారి కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధు లపై గ్రామాలలో ప్రజలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వర్షాకాలంలో ముఖ్యంగా రెండు కారణాల వల్ల వ్యాధులు వస్తాయని అవి ఒకటి కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధులు, రెండవది దోమల ద్వారా వచ్చే వ్యాధులు, కలుషితమైన నీరు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల టైఫాయిడ్, విరోచనాలు వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. దోమల వల్ల మలేరియా, వైరల్ ఫీవర్ , డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్ర పరచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కొంత వరకు వ్యాధులను అరికట్ట వచ్చునని వైద్య సిబ్బంది సూచించారు. వాటిని పాటిస్తే వ్యాధుల బారి నుండి కాపాడు కోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










