సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న జోనల్ కమిషనర్ రాము
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి శ్రీకృష్ణాపురంలో డెంగీ, మలేరియా వ్యాధులపై గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ బి.రాము ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంట్లో తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరారు. వారానికోసారి డ్రైడేను పాటించాలని, ఇళ్లలో నీటి ట్యాంకులను శుభ్రపరిచి, ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, ఎసిపి శాస్త్రి, ఎఇ అప్పాజీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామారావు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.










