ప్రజాశక్తి -మాధవధార : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జోనల్ కమిషనర్ కృష్ణారావు, 51వ వార్డు కార్పొరేటర్ ఆర్.వెంకటరమణ సూచించారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాల సీజన్‌లో పారిశుధ్యం క్షీణించి, ఎక్కడికక్కడే నీరు నిలిచి, అందులో వివిధ వ్యాధులకు కారణమైన దోమలు, వాటి లార్వాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టి బాబు, సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ములగాడ: 62వ వార్డు దుర్గానగర్ గాంధీజీవీధి, జాలారివీధి, 40వ వార్డు ఎకేసీ కాలనీ సచివాలయాల పరిధిలో శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాపురం ఏరియా మలేరియా ఇన్‌స్పెక్టర్ డి రవికుమార్ డ్రైడే ఆవశ్యకతను వివరించి, దోమలు విజృంభించకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో డీఎంవో సిబ్బంది ఎంపిహెచ్‌ఎ రోమాల వేణుబాబు, మలేరియా సూపర్‌వైజర్ దుల్లా శ్రీనివాసరావు, శానిటరీ సెక్రటరీలు జీ శ్రీనివాసరావు, సత్తిబాబు, సచివాలయాల హెల్త్ సెక్రటరీలు రమ్య, సుజాత, రాము, ఆశా కార్యకర్తలు నాగమణి, సత్యవతి, పావని, కన్నయ్యమ్మ, మలేరియా సిబ్బంది డి.లలితకుమారి, శ్రీదేవి, పొడుగు రత్నం, వార్డు వాలెంటీర్లు పాల్గొన్నారు.










