Nov 05,2023 23:36

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : నగరి నియోజకవర్గం వడమాల పేట మండలం, బేరువాని కండ్రిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు వర్మ వారి వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి మంజూరు చేసిన లక్ష రూపాయల చెక్కును రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాలు, యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్‌కె రోజా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వడమాల పేట మండల వైసిపి జడ్‌పిటిసి సురేష్‌ రాజు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.