Mar 25,2023 19:46

పాలాభిషేకం చేస్తున్న వాల్మీకులు

సీఎం చిత్రపటానికి వాల్మీకులు పాలాభిషేకం

ప్రజాశక్తి - బేతంచెర్ల

రాష్ట్రంలో బోయ వాల్మీకి కులస్తులు ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాటాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల చివరి రోజు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడాన్ని హర్షిస్తూ శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి మండలంలోని వాల్మీకులు బోయలుపాలాభిషేకం చేశారు. రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, చైర్మన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వాల్మీకులు అధిక సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మురళీకృష్ణ, ఎంపీపీ నగర పంచాయతీ చైర్మన్లు మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రాధాన్యతను కల్పించడం వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వానికి సాధ్యమైందని వారన్నారు. ఎంతోమంది వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తామని మాటల చెప్పడం తప్ప చేసింది లేదన్నారు. ముఖ్యమంత్రిజగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. ఎవ్వరైతే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారో వారిని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు వెంకటరాముడు, కృష్ణమూర్తి, రామస్వామి, మనోహర్‌, రామకృష్ణ, రంగస్వామి, నారాయణ, మనోహర్‌, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.