సీఐటీయూ నూతన జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ నియామకం
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్: తిరుపతి జిల్లా మొదటి సీఐటీయూ మహాసభలు తిరుపతి పట్టణంలోని రామతులసి కళ్యాణ మండపంలో ఈనెల 11, 12వ తేదీల్లో జరిగాయి. ఈ సందర్భంగా కార్మిక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. జిల్లా మహాసభ సందర్భంగా నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. సీఐటీయూ తిరుపతి జిల్లా కార్యదర్శిగా వెంకటేశులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు కూలి పెంచాలని.. విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని, తమిళనాడు తరహాలో 750 యూనిట్లు పవర్లూమ్ కార్మికులకు ఉచితంగా ఇవ్వాలని, అలాగే పట్టణాల్లో వ్యాపారం చేస్తున్న వారికి గుర్తింపు కార్డులు, లోన్ సౌకర్యం కల్పించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి క్లైమ్ నిధులు అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజులు జరిగిన వంటి జిల్లా మహాసభల ఆటో యూనియన్ నాయకులు విజరు, శివ, యాసిన్, బాషా, పురుషోత్తం, కష్ణమూర్తి, రమేష్, అంగన్‌వాడీ నాయకులు శ్యామల, మునికుమారి, రాధా, లలిత, ధనమ్మ, ఎల్‌ఐసీ యూనియన్ నాయకులు లక్ష్మణ్‌కుమార్, దస్తగిరి, వెంకటేశ్వర్లు, బిల్డింగ్ యూనియన్ మోసస్, నరసింహులు, గోవింద్‌రెడ్డి తదితరులు వెంకటేళులు ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.










