
కేరళ బృందం సూచన
ప్రజాశక్తి - ఆకివీడు
సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్ ఓమన్ మ్యాథ్యూస్ కేరళ వైద్య బృందం ఆసుపత్రి వైద్యులకు సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య పథకాల అమలు పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కేరళ వైద్య బృందం పరిశీలించింది. జెఎస్‌వై, జెఎస్‌ఎస్‌కె, పిఎంఎస్‌ఎంఎ, హెచ్‌ఐఎం ఎస్, సిడి, ఎన్‌సిడి, కంటి వెలుగు, వైఎస్‌ఆర్ క్లినిక్ పథకాల అమలు వాటి పనితీరు పరిస్థితులను రికార్డులను పరిశీలించారు. సిజేరియన్లు ట్యుబెక్టమి, నవజాత శిశు పర్యవేక్షణ ఫార్మసీ, లేబరేటరీ, డెంటల్ విభాగాలను విడివిడిగా పరిశీలించారు. ఈ విభాగాలను మరింత అభివృద్ధి చేసి సేవలు ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువెళ్లాలని సూచించారు. సామాజిక ఆరోగ్య కద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి ఎంఎస్.ప్రసాద్, వైద్య ప్రముఖులు డాక్టర్ సుగుణరాజు, పివి.భాస్కరరావు, ల్యాబ్ టెక్నీషియన్ విజయకుమార్ పాల్గొన్నారు.