Nov 13,2022 23:22

గర్భిణి బంధువులతో మాట్లాడుతున్న వైద్యురాలు

ప్రజాశక్తి-అడ్డతీగల
మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని డి.భీమవరం పంచాయతీ మామిడిపాలెం గ్రామానికి చెందిన పొత్తూరు కృష్ణవేణి మొదటి కాన్పునకు 108 వాహనంలో అడ్డతీగల సిహెచ్‌సికి రాగా, ఆసుపత్రి వైద్యులు దుప్పులపాలెం పిహెచ్‌సికి తీసుకెళ్లకుండా ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తమ ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేరు కాబట్టి డెలివరీ చేయడం ఇబ్బంది అవుతుందని, రంపచోడవరం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక 108 సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్డతీగల ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో జరుగుతున్న జాప్యంపై అధికారులు పర్యక్షేక్షించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.