Dec 09,2022 23:42

ఆసుపత్రిలో నిలుచున్న గర్భిణీలు

ప్రజాశక్తి -కోటవురట్ల:ప్రధానమంత్రి మతృత్వ యోజన పథకంలో భాగంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో పరీక్షల వచ్చిన గర్భిణీలు అవస్థలు పడ్డారు. కనీస వసతులు లేక ఇబ్బంది పడ్డారు.ప్రతి నెల 9న నిర్వహిస్తున్న పరీక్షలకు వచ్చే గర్భిణీలకు సిహెచ్‌సిలో కూర్చునేందుకు కుర్చీలు లేక పోవడంతో నిలుచూనే ఉండి పోయారు. మండల వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ సహా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద సుమారు 400 మంది వరకు ప్రతినెల పరీక్షలు జరుపుతున్నట్లు ఆరోగ్య విస్తరణ అధికారి గోవిందరావు తెలిపారు.