Aug 01,2023 22:16

వైద్యాధికారికి వినతిని అందజేస్తున్న సిహెచ్‌డబ్ల్యుఒలు

ప్రజాశక్తి -సాలూరురూరల్‌ : కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు నెలనెలా జీతాలు చెల్లించాలని ఆశా, సిహెచ్‌డబ్ల్యుఒ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని మామిడిపల్లి వైద్యాధికారికి మంగళవారం వినతిని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మూడునెలల వేతనాలు నేటికీ చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో పని చేసే వారంతా పేదలేనని, వేతనంపై కుటుంబం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇచ్చేదే తక్కువ వేతనమని, అది కూడా సమయానికి ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మండలంలోని హనుమంతువలస సిహెచ్‌డబ్ల్యుఒ చేరిప్పటి నుంచి నేటికి ఒక్క సారి కూడా జీతం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు మాలాంటి చిరుద్యోగులను ఇబ్బందులకు గురుచేయకుండా నెలనెలా జీతాలు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయడు, సిహెచ్‌డబ్ల్యుఒ ప్రతినిధులు రవణమ్మ, వరలక్ష్మి, పావని, గంగ, సూరమ్మ పాల్గొన్నారు.