Sep 28,2023 19:54

ఒప్పంద పత్రాలు చూపుతున్న సీతం, సిఎస్‌సి అకాడమీ ప్రతినిధులు

ప్రజాశక్తి-విజయనగరం :   స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్‌ కళాశాల, సిఎస్‌సి అకాడమీ మధ్య పరస్పరం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన మొదటి విద్యాసంస్థ సీతం. ఈ ఒప్పందంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లో శిక్షణ పొందేందుకు ఉచితంగా కోర్సులు నేర్పిస్తూ సి-డాక్‌, ఐఇఇఇ సర్టిఫికేట్‌ జారీ చేస్తుంది. కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్‌ స్ప్రింగ్‌బోర్డ్‌ ప్లాట్‌ఫారమ్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డివి రామమూర్తి తెలిపారు. సీతం డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు సమక్షంలో ఎంఒయూపై సంతకాలు జరిగాయి. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.డి.వి.ఎ నాయుడు, సిఎస్‌సి అకాడమీల విఎల్‌ఇ ై రామ్మోహనరావు, సిఎస్‌సి అకాడమీ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పి.సౌజన్య పాల్గొన్నారు.