May 05,2023 23:33

సమావేశంలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ వసతి గృహాలను ఆధునీకరించి, విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించాలనే జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సంకల్పంలో భాగంగా ప్రముఖ కంపెనీలు, బ్యాంకర్లతో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సిఎస్‌ఆర్‌) సమావేశం జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాలోని 75 వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన, మరమ్మతులకు సమకూర్చాల్సిన సూమారు రూ.6.23 కోట్లు నిధుల సేకరణ, త్వరితగతిన పనులు పూర్తి చేయడంపై ఐటీసీ, కోకో-కోలా, పెరల్‌ బేవరేజస్‌, కెనారా, ఐఓబీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎల్డీఎం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు చెందిన ప్రతినిధులతో జెసి చర్చించారు. సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని చెప్పారు. పూర్తి వివరాలతో మరోక వారంలో నిర్వహించే సమావేశానికి హాజరవుతామన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదనరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఈదర రాంబాబు పాల్గొన్నారు.