
పజాశక్తి - రాజానగరం మైసూరుకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్), సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్‌టిఆర్‌ఐ) సంస్థలతో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి అవగాహాన ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఎంఒయు కార్యక్రమంలో విసి కె.పద్మరాజు, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విసి తోలేటి జానకిరామ్, సిఎస్‌ఐఆర్, సిఎఫ్‌టిఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్, రిజిస్ట్రార్ జి.సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విసి కె.పద్మరాజు మాట్లాడుతూ మైసూర్‌లోని సిఎఫ్‌టిఆర్‌ఐ వంటి ప్రముఖ సంస్థలలో ఎంఒయు ద్వారా రెండు సంవత్సరాల ఎంఎస్‌సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు మార్గనిర్దేశం చేయడం, ప్రోగ్రామ్ రూపకల్పన కోసం నిపుణులను బిఒఎస్‌కి నామినేట్ చేయడం, అతిథి ఉపన్యాసాలను నిర్వహించడం, చెల్లింపు ప్రాతిపదికన విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌ను ఆఫర్ చేయడం వంటి ప్రయోజనాలు అందుతాయన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ విసి తోలేటి జానకిరామ్ మాట్లాడుతూ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆవిర్భావం, వికాసాలను వివరించారు. సిఎస్‌ఐఆర్, సిఎఫ్‌టిఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీతో ఎంవోయు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవగాహాన ఒప్పందాలపై శ్రీదేవి అన్నపూర్ణ సింగ్, రిజిస్ట్రార్ జి.సుధాకర్‌లు సంతకాలు చేసి వీసీ ఆచార్య కె.పద్మరాజు సమక్షంలో ఎంవోయు పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అనుబంధ కళాశాలల అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.