Jul 16,2023 23:29

మాట్లాడుతున్న జోగినాయుడు


ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి సినీ నటుడు, సాంస్కతిక కళా క్రియేటివ్‌ హెడ్‌ జోగినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని సంభోదించే తీరును పవన్‌ కళ్యాణ్‌ మార్చుకుంటే మంచిదని తెలిపారు. సినిమా ఇండిస్టీకి 'మీరు చేసింది ఏమీ లేదని, కోట్ల రూపాయలు రేమ్యునిరేషన్‌ తీసుకుంటున్నట్టు మీరే చెప్పారని, ఏదో ఉద్దరిస్తాం అన్నట్టుగా ఉత్తి మాటలు చెప్పడం దేనికని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతున్నా ఎందుకు రాజకీయంగా ఎదగలేదన్నారు. ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేకోవాలని సూచించారు. పవన్‌ కళ్యాణ్‌ సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చు కోవాలని, ఆవేశంతో ఊగిపోతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదన్నారు. పది సంవత్సరాల పాటు కష్టపడి, ప్రజల మధ్య ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ ఎదిగారని, ఆయనపై విమర్శలు చేసేటప్పుడు సంస్కారవంతంగా మాట్లా డాలన్నారు.