
సిఎంను కలిసిన కేసరి నాగమణి కృష్ణా రెడ్డి
ప్రజాశక్తి - వన్‌టౌన్ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగు తున్నాయి. 20వ తేదీ దుర్గమ్మ జన్మ నక్షత్రం రోజు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సిఎంను దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు కేసరి నాగమణి, ఎనీఆర్ జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్, జెసిఎస్ కన్వీనర్ కేసరి కృష్ణారెడ్డిమోహన్ కలిశారు. పాలకమండలి సభ్యురాలుగా తనకు అవకాశం కల్పించినందుకు కేసరి నాగమణి, కేసరి కృష్ణారెడ్డి సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు.