Sep 14,2023 18:55

సిఎంను సత్కరిస్తున్న ఎంఎల్‌సి

ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌ :తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం పలు విషయాలను చంద్రశేఖర్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఇటీవల నెల్లూరులో జరిగిన విద్యా సదస్సు గురించి చంద్రశేఖర్‌ రెడ్డి సిఎంకు వివరించారు. విద్యా సదస్సు నిర్వహించడంపై సిఎం జగన్మోహన్‌ రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డిని అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రశేఖర్‌రెడ్డికి సిఎం సూచించారు.