Oct 19,2023 20:03

సిఎంను కలిసినఎమ్మెల్యే

సిఎంను కలిసిన ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కర్నూల్‌ ఓర్వకల్లు విమానాశ్రయంలో గురువారం ఎపి జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రా రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు.
నందికొట్కూరు టౌన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని అత్యవసర సమస్యలను నివేదికల రూపంలో సిఎం దృష్టికి తీసుకెళ్లారు.