Nov 26,2022 23:54

ప్రజాశక్తి-మాడుగుల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పరిపాలించే హక్కు లేదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ పివిజి కుమార్‌ తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం మాడుగులలో రాష్ట్ర పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బస్టాండ్‌ లోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేయకుండా రాజారెడ్డి పరిపాలన చేస్తున్న వైసిపి అరాచకాలను ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పేద ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్న వైఎస్‌ జగన్కు పరిపాలించే నైతిక హక్కు లేదని ఆరోపించారు. కోర్టు తీర్పులను ధిక్కరించే ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని ఆయన వైయస్‌ జగన్‌ ఒకరు మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బవరపు రామునాయుడు, పేరపు కొండబాబు, గొల్లవిల్లి శ్రీరామమూర్తి, రంజిత్‌ వర్మ, మరువాడ ఈశ్వర రావు, పుప్పాల రమేష, కసిరెడ్డి అప్పలనాయుడు, నాయకలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.