
చెక్కు అందిస్తున్న మంత్రి
ప్రజాశక్తి-మాడుగుల:ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు బుదవారం తారువ క్యాంప్ కార్యాలయం లో పంపిణీ చేశారు. మాడుగుల మండలం ఎం కోడూరుకు చెందిన చింత సోమకేశ్వరరావు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు. దీని నిమిత్తం ఆసుపత్రి బిల్లులతో సహా ,కుటుంబ సభ్యులు ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా మంజూరు అయ్యింది. ఆయన కుమారుడు చింత వెంకట నారాయణ మూర్తికు ఉప ముఖ్యమంత్రి చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంజీవరావు, పడాల అప్పలనాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు