Nov 05,2023 20:08

చెక్కు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌ : ఇంటర్‌ చదువుతున్న గూడూరు కు చెందిన గిరిధర్‌ సాయికుమార్‌ కుమారుడు శశాంక్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. తల్లి దండ్రులు 2 నెలల పాటు అపోలో మరియు నారాయణ హాస్పిటల్స్‌ లో చికిత్స అందించారు. శశాంక్‌ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. దీంతో శశాంక్‌ చికిత్స నిమిత్తం వారు వెచ్చించిన ఖర్చులో కొంత భాగం అయినా సహాయం చేయాలన్న ఆలోచనతో ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు దరఖాస్తు చేశారు. రూ. 4 లక్షల 50 వేల చెక్కును మంజూరు చేయించి ఆ చెక్కును ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో శశాంక్‌ తండ్రి గిరిధర్‌ సాయికుమార్‌ కు అందజేశారు. దీంతో ఎంఎల్‌సి చంద్రశేఖర్‌ రెడ్డికి గిరిధర్‌ సాయికుమార్‌ కతజ్ఞతలు తెలిపారు.