Oct 06,2023 22:03

ప్రజాశక్తి - పాలకొల్లు
            సిఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ బాధితులకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం అందించారు. పోడూరు మండలంలోని పెనుమదం గ్రామానికి అడబాల దుర్గమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సమస్య గోపీ దృష్టికి వెళ్లింది. స్పందించిన గోపి సిఎం సహాయ నిధి నుంచి రూ.మూడు లక్షల చెక్కును బాధితులకు శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరు పెద్దిరాజు, డిటిడిసి బాబు, జిల్లా కార్యదర్శి కొండేటి రవి, జెసిఎస్‌ కన్వీనర్‌ బళ్ల రాజశేఖర్‌, సొసైటీ ప్రెసిడెంట్‌ కొర్రపాటి వీరాస్వామి, గ్రామ అధ్యక్షులు గెద్దాడ వెంకటరమణ (ఏసు), వైస్‌ ప్రెసిడెంట్‌ పితాని సత్యనారాయణ (చిన్న), ఎంపిటిసి సభ్యులు-2 చుట్టుగుళ్ల ఆంజనేయులు, పాఠంశెట్టి నాగరాజు, చెల్లిబోయిన బాబూరావు, ముచర్ల రాము, ఎం.ఆంజనేయులు, దిగమర్తి నాగరాజు, బీర రాజశేఖర్‌, చుట్టుగుళ్ల జయరాజ్‌ పాల్గొన్నారు.