ప్రజాశకి ్త-నెల్లూరు :మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నగరంలో టిడిపి శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్లేక్సీని దగ్ధం చేశారు. శనివారం టిడిపి నాయకులు , మాజీ మంత్రి పి.నారాయణ, టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పిలుపు మేరకు సిటీ నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిరసనకు బయల్దేరిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని బాలాజీనగర్ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసు వలయం నడుమ పరాహా కాశారు. దీంతో కోటంరెడ్డి ఇంట్లోనే నిరసన తెలిపారు. జగన్ ఫ్లెక్సీనీ తగలబెట్టారు. జగన్ సైకో లాగా తయారయ్యాడని మండిపడ్డారు. మాగుంట లే అవుట్ ప్రాంతంలోని రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేసేందుకు ఆయన ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. దీంతో ఎంఎల్‌ఎ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తూ నోటీసులు ఇవ్వకుండా తన ఇంట్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. రోడ్డుపై బైటాయించి పోలీసు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ కార్పొరేటర్ ఉచ్చిభువనేశ్వర్ ప్రసాద్, ఆకుల హనుమంతు, పసుపులేట్టి మల్లికార్జున్,పెంచిల్ చౌదరి, అంచురి శ్రీనివాసులు నాయుడు, , ఇంకబల్,మహేంద్ర రెడ్డీ,వెంకహాయ్య యాదవ్, సుజన్, రియాజ్,సుధా,సాయి రామ్, శుభహన్ బాషా పాల్గొన్నారు.










