Oct 21,2023 22:27


ప్రజాశక్తి - రాజానగరం ఈ నెల 26న సిఎం జగన్‌ రాజమహేంద్రవరం రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లును మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్‌, ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజాలతో కలిసి శనివారం పరిశీలించారు. దివాన్‌ చెరువు సమీపంలోని జిబివి లే అవుట్‌ వద్ద హెలిపాడ్‌, రూట్‌ మ్యాప్‌ పాయింటింగ్‌ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భం గా మంత్రి వేణుగోపాల్‌ మాట్లాడుతూ స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేటు కార్యక్ర మానికి సిఎం హాజరు కానున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలన చేసి, దిశా నిర్దేశం చేశామన్నారు. ఈ పర్యటనలో ఆర్‌అండ్‌బి అధికారి ఎస్‌బివి.రెడ్డి, డిఇ బివివి మధు సూధన్‌ పాల్గొన్నారు.