Dec 29,2022 23:55

మాట్లాడుతున్న ఎంపిపి

ప్రజాశక్తి-రోలుగుంట:ఈ నెల 30న శుక్రవారం నర్సీపట్నంలో జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. గురు వారం ఎంపిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్‌ పర్యటన విజయవంతం అయ్యేందుకు ప్రతీ సచివాలయ పరిధిలోని పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా విఒఎలు కృషి చేయాలని కోరారు.
గొలుగొండ:ఈ నెల 30న నర్సీపట్నంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైసిపి మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలం నుంచి 115 వాహనాల్లో 7500 మంది తరలి వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.