Sep 13,2023 22:11

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌పి ఎం.దీపిక

ప్రజాశక్తి-విజయనగరం :  ఈనెల 15న ముఖ్యమంత్రి పర్యటనకు ఒక అదనపు ఎస్‌పి,ఆరుగురు డిఎస్‌పిలు, సుమారు 900మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. బుధవారం బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బందోబస్తును వివిధ కేటగిరిలుగా విభజించి, భద్రత ఏర్పాట్లు చేసామని, ఒక్కో విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామన్నారు. హెలిప్యాడ్‌, పార్కింగు, కాన్వారు, వైఎస్‌ఆర్‌ విగ్రహ ఆవిష్కరణ, శిలా ఫలకం, రూట్‌ బందోబస్తు, ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌, పార్కింగు, వైద్యకళాశాల భవనంవద్ద విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను, సిబ్బందిని నియమించామన్నారు. పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పి అస్మా ఫర్దీన్‌, డిఎస్‌పిలు , సిఐలు, ఉన్నారు.