కడప : ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహ న్‌రెడ్డి జులై మొదటి వారంలో నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని, అధికా రికంగా ఖరారు కావాల్సి ఉందని, ఏర్పాట్లు పకడ్బం దీగా ఉండాలని కలెక్టర్ విజరు రామరాజు అన్నారు. బుధవారం కలెక్టరేట్ స్పందన హాలులో సిఎం పర్యటన ముందస్తు ఏర్పా ట్లపై ఎస్‌పి అన్బు రాజన్, జెసి జి.గణేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, డిఎఫ్‌ఒ సందీప్, పాడా ఒఎస్‌డి అనిల్ కుమార్‌రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం పర్యటనను విజయ వంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించామన్నారు. కడప, ఇడుపులపాయ, కొప్పర్తి, పులివెందుల, గండికోటలలో జరిగే ముఖ్యమంత్రి పర్య టనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా గట్టి ఏర్పాట్లు చేయా లని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు. హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్, బ్యారికేడింగ్ తదితర ఏర్పా ట్లను ఆర్‌అండ్‌బి అధికారులు పటిష్టంగా చేపట్టాలన్నారు. సమావేశంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, డిఆర్‌డిఎ పీడీ ఆనంద నాయక్, సిపిఒ వెంకట రావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మహేశ్వరరెడ్డి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి వెంకట సుబ్బయ్య, డిపిఒ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.










