ప్రజాశక్తి - దెందులూరు
దెందులూరులో శనివారం ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎంఎల్‌సి తలశిల రఘురామ్ తెలిపారు. ఈ మేరకు సభాస్థలి వద్ద అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










