Oct 01,2023 23:52

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌, పెద్దాపురం 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సామర్లకోట పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, సిఎం పర్యటనల సమన్వయ్యకర్త తలశిల రఘురామ్‌లు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్‌ అధ్యక్షతన సిఎం పర్యటనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసిన ఇటిసి లేఔట్‌ను పరిశీలించారు. అనంతరం పెద్దాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తలశిల రఘరాం, కాకినాడ ఎంపీ వంగా గీత, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, జెఎండి ఎం.శివప్రసాద్‌, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, పిఠాపురం ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, ఎస్‌పి సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ పాల్గొన్నారు. ప్రజలు, లబ్ధిదారులు తరలి వచ్చేందుకు అవసరమైన రవాణా వాహనాలను ఏర్పాటు చేయాలని డిటిసిని ఆదేశించారు. వాహనాల రూట్లు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోస్తు ఏర్పాటలను పోలీస్‌ శాఖకు సూచించారు. మఖ్యమంత్రి పర్యటనలో రోడ్‌ షో, బహిరంగ సభల వద్ద పటిష్టమైన బారికేడింగ్‌ ఏర్పాటుకు రోడ్లు భవనాల ఎస్‌ఇని ఆదేశించారు. హెలిపాడ్‌, రోడ్‌ షో, బహిరంగ సభల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు, కాన్వారులో వైద్యాధికారులతో కూడిన అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒకు సూచించారు. బహిరంగ సభ నిర్వహణకు వేదిక, సభాప్రాంగణం ఏర్పాట్లను కుడా విసి చేపట్టాలని చెప్పారు. తలశిల రఘురాం మాట్లాడుతూ సియం పర్యటనకు హాజరైయ్యే ప్రజలు, లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. తొలుత సిఎం సామర్లకోటలో పర్యటించే ప్రదేశాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.శ్రీధరరెడ్డి, ఎఎస్‌పి పి.శ్రీనివాస్‌, హౌసింగ్‌ పీడీ సుధాకరపట్నాయక్‌, కాకినాడ ఆర్‌డిఒ ఎన్‌.వివి.సత్యన్నారాయణ, పెద్దాపురం ఆర్‌డిఒ జె.సీతారామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, యండిఓలు, మున్సిపల్‌ కమీషనర్లు పాల్గొన్నారు.