ప్రజాశక్తి-తిరువూరు: ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరువూరులో ప్రారంభించనున్న విద్యా దీవెన కార్యక్రమ పనులను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జెసి శ్రీవాస్ నూపూర్ శుక్రవారం పరిశీలించారు. అయ్యప్పస్వామి దేవాలయం పక్కన ఏర్పాటు చేస్తున్న బహిరంగ వేదిక వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. వర్షం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా రెయిన్ పట్టాల షామియాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం బురద కాకుండా క్వారీ డస్ట్ పోయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, ఎంపిడిఓ ఎం.నాగేశ్వరరావు, తహశీల్దార్లు సురేష్ బాబు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










