సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జెసి తదితరులు
ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెంలో ఈ నెల 24న నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. కృష్ణాయపాలెంలో పేదలకు సెంటు స్థలం పంపిణీ చేసిన జగనన్న లే అవుట్‌లో గృహ నిర్మాణాలకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ సోమవారం రాత్రి పరిశీలించారు. తాగునీరు, వాహనాల పార్కింగ్, బారికేడ్లు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ వెంట డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్, డ్వామా పీడీ వేణుగోపాల్, సిఆర్‌డిఎ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










